Mon Mar 16 2026 03:00:40 GMT+0530 (India Standard Time)
వైసీపీకి గుడ్ బై.. టీడీపీలో చేరిక
కర్నూలు జిల్లాలో వైసీపీకీ షాక్ తగిలింది. వైసీపీకి కప్పట్రాళ్ల బొజ్జమ్మ గుడ్ బై చెప్పారు

కర్నూలు జిల్లాలో వైసీపీకీ షాక్ తగిలింది. వైసీపీకి కప్పట్రాళ్ల బొజ్జమ్మ గుడ్ బై చెప్పారు. బొజ్జమ్మ వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు సమక్షంలో నేడు టీడీపీలో బొజ్జమ్మ దంపతులు చేరనున్నారు. దీంతో కర్నూలు జిల్లాలో పార్టీ బలోపేతం అవుతుందని కర్నూలు జిల్లా టీడీపీ నేతలు చెబుతున్నారు.
సత్తెనపల్లిలో కలిసిన నేతలు..
మరోవైపు సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీలో ఐక్యతా రాగం వినిపిస్తుంది. కన్నా లక్ష్మీనారాయణను టీడీపీ నేత కోడెల శివరాం కలిశారు. కన్నాతో కలిసి పని చేసేందుకు కోడెల శివరాం సంసిద్ధం వ్యక్తం చేశారు. తనకు సత్తెనపల్లి టిక్కెట్ రాలేదని గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న కోడెల శివరాం ఈరోజు కన్నాను కలసి ఆయన విజయానికి కృషి చేస్తానని చెప్పారు.
Next Story

