Fri Dec 05 2025 12:23:08 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన బాలుడి మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన యత్విక్ సాయి మరణించాడు

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన బాలుడు మరణించాడు. ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన తుర్లపాటి శ్రీనివాసరావు కుటుంబం అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలోని జెఫరస్ సిటీలో నివాసం ఉంుంది ఈ నెల 24వ తేదీన సాయంత్రం శ్రీనివాసరావు చిన్న కుమారుడు యత్విక్ సాయి తన తండ్రితో కలసి సైక్లింగ్ కు వెళ్లాడు.
వెనక నుంచి ట్రక్కు వచ్చి...
అతని స్నేహితులు వెనక వస్తుండటంతో వారితో కలసి సైక్లింగ్ చేస్తున్నాడు. శ్రీనివాసరావు మాత్రం ముందుకు వెళ్లాడు. అయితే రోడ్డు మలుపులో సైకిల్ తొక్కుతున్న యత్విక్ సాయిని వెనక నుంచి ట్రక్కు ఢీకొట్టింది. సైకిల్ జాగ్రత్తగా నడపాలంటూ తండ్రి సూచనలు చేరక ముందే ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు కొంత దూరం బాలుడు యత్విక్ సాయిని ఈడ్చుకుని వెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు. దీంతో ముప్పాళ్ల గ్రామంలో విషాదం నెలకొంది.
Next Story

