Sun Mar 15 2026 07:30:18 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు ప్రకటనను స్వాగతించిన యార్లగడ్డ
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గా పునరుద్ధరించినందుకు సీఎం చంద్రబాబుకు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు

వైఎస్ఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గా పునరుద్ధరించినందుకు సీఎం చంద్రబాబు, వైద్య మంత్రి సత్యకుమార్ కు హిందూ పరిషత్ అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ కు భారతరత్న సాధిస్తామని చంద్రబాబు చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు.
హిందీభాషను....
అదే విధంగా హిందీ భాషను ఐక్యరాజ్య సమితి కూడా అధికార భాష గా గుర్తించాలని హిందూ పరిషత్ అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కోరారు.రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే, వైఎస్ఆర్సీపీ కి జరిగింది కూడా ఇదేనంటూ యార్లగడ్డ వ్యాఖ్యానించారు.గతంలో ఎన్ టీ ఆర్ వైద్య విశ్వవిద్యాలయ పేరు మార్చిన సందర్భంలో హిందీ భాష చైర్మన్ పదవితో పాటు పలు నామినేటెడ్ పదవులకు రాజీనామా చేశారు ఆయన.
Next Story

