Sat Mar 07 2026 21:21:19 GMT+0530 (India Standard Time)
యార్లగడ్డ రాజీనామా
అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేశారు

అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడం బాధగా ఉందని, అందుకే తాను అన్ని పదవులకు తాను రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఎన్టీఆర్ పేరు హెల్త్ యూనివర్సిటీకి తొలగించడం సరికాదని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. వైఎస్సార్ కు ఎన్టీఆర్ అంటే ఎంతో గౌరవం ఉండేదని ఆయన అన్నారు.
వైఎస్ మంచితనం....
తాను బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు హడావిడిగా వైఎస్ దగ్గరకు వెళ్లానని, "ప్రొఫెసర్ మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు. ఏమీ కాదు" అని తనతో అన్నారన్నారు. ఆయనపై ఎంత వత్తిడి వచ్చినా ఫిర్యాదు లేని కారణంగా కేసు పెట్టవద్దని నాడు వైఎస్ చెప్పారన్నారు. అలాంటి వైఎస్సార్ పేరును ఇతర వాటికి పెట్టుకోవచ్చన్నారు. కానీ వైఎస్సార్ కు ఎన్టీఆర్ అంటే అమిత ఇష్టమని చెప్పారు. ఎన్టీఆర్ పేరును తొలగించడం తనను బాధించిందని, అందుకే పదవులకు రాజీనామా చేస్తున్నానని ఆయన తెలిపారు.
Next Story

