Wed Mar 25 2026 16:18:50 GMT+0530 (India Standard Time)
నా కుమారులు రాజకీయాలలోకి రారు : యరపతినేని
గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారులను రాజకీయాల్లోకి తేవాలనుకోవడం లేదన్నారు.

గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారులను రాజకీయాల్లోకి తేవాలనుకోవడం లేదన్నారు. తన కుమారులు ఎవరూ రాజకీయాల్లోకి రారని ఆయన ప్రకటించారు. తన గెలుపు కోసం పార్టీలో తిరిగినా, ప్రజల వద్దకు వెళ్లినా వారు అంతవరకే ఉంటారని, రాజకీయాలను పట్టించుకోరని యరపతినేని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
వ్యాపారాలకే...
వారు రాజకీయాల్లోకి రారని, వ్యాపారాలు మాత్రమే చూసుకుంటారని యరపతినేని శ్రీనివాసరావు కొద్దిసేపటి క్రితం స్పష్టం చేశారు. తన తర్వాత తన కుమారులు రాజకీయాల్లోకి వస్తారని ఎవరూ అనుకోవద్దని కూడా ఆయన తెలిపారు. వారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రారని, ఎమ్మెల్యే సీటు కోసం పోటీ పడరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మాత్రమే రాజకీయాల్లో ఉంటానని ఆయన తెలిపారు.
Next Story

