Tue Mar 17 2026 04:36:28 GMT+0530 (India Standard Time)
Yanamala : అదానీ, జగన్ మధ్య డీల్ జరిగింది
పారిశ్రామికవేత్త అదానీ, మాజీ ముఖ్యమంత్రి జగన్ మధ్య డీల్ జరిగిన మాట వాస్తవమేనని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు

ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ, మాజీ ముఖ్యమంత్రి జగన్ మధ్య డీల్ జరిగిన మాట వాస్తవమేనని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. క్విడ్ ప్రోకో కింద కేసు నమోదు చేయాలన్నారు. ఇప్పటికే అమెరికాలో కేసు నమోదయిందన్న యనమల రామకృష్ణుడు దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. పెద్దయెత్తున అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు.
సీబీఐ దర్యాప్తునకు...
సీబీఐ దర్యాప్తునకు ఆదేశించకపోతే రాష్ట్ర ప్రభుత్వమైనా సీఐడీ చేత దీనిపై విచారించాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. లేకుంటే అవినీతిపరులను కాపాడినట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్ అవినీతి విశ్వవ్యాప్తమయిందన్న యనమల ఇప్పుడు ఏపీ పరువు అమెరికాలోనూ పోయిందని ఆయన ఎద్దేవా చేశారు.
Next Story

