Sat Dec 13 2025 22:35:56 GMT+0000 (Coordinated Universal Time)
Yanamala Ramakrishnudu : యనమల రూటు మార్చారా? అటు వైపు చూపు పడిందా?
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తన రూటు మార్చినట్లు కనపడుతుది.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తన రూటు మార్చినట్లు కనపడుతుది. ప్రతిపక్షాన్ని విస్మరించ కూడదని, వాళ్లని తేలిగ్గా వదిలేస్తే పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వైసీపీ సోషల్ మీడియా యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలను పదే పదే పోస్టులు చేస్తున్నారు. మెడికల్ కశాశాలల ప్రయివేటీకరణ విషయంలో వైసీపీలో కసి కనిపిస్తుందిని యనమల రామకృష్ణుడు చెప్పడం కూడా తమకు కలసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. రాజకీయంగా మాత్రమే కాకుండా అధికార పార్టీ నేతల నుంచే ఇలాంటి హెచ్చరికలు రావడం ప్రజల్లో కూడా చర్చ జరుగుతుండటం టడీపీకి కొంత ఇబ్బందికరంగా మారింది.
వ్యాఖ్యల్లో తప్పు లేకపోయినా...
నిజానికి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలలో ఎలాంటి తప్పులేదు. అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ప్రతిపక్షాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. తేలిగ్గా తీసుకుంటే అది పార్టీ పతనానికి కారణమవుతుంది. అది వైసీపీకి కాని, టీడీపీకి గాని వర్తిస్తుంది. కానీ యనమల రామకృష్ణుడు సీఐఐ సమ్మిట్ జరుగుతున్న సమయంలో చేసిన వ్యాఖ్యలు మాత్రం టీడీపీకి రాజకీయంగా ఇబ్బందిని కలిగించాయని చెప్పాలి. అయితే యనమల రామకృష్ణుడు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చన్న కోణంలో టీడీపీ అగ్రనాయకత్వం విచారణ జరుపుతుందట. తొలి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న యనమల రామకృష్ణుడుకు ఈ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పదవి దక్కలేదు.
పదవి కోసమేనా?
పదవి కోసమే యనమల రామకృష్ణుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? అన్న అనుమానం కూడా టీడీపీ నేతల్లో వ్యక్తమవుతుంది. ఇంకో ఆరు నెలల్లో రాజ్యసభ స్థానాలు ఖాళీలవుతున్నాయి. తనను పార్టీ గుర్తించాలని యనమల రామకృష్ణుడు ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? అన్నది కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఇప్పటికే యనమల రామకృష్ణుడు కుటుంబంలో అనేక మందికి పదవులు ఉండటంతో ఆయనకు పదవి ఇవ్వడంపై అనుమానాలున్నాయి. యనమల రామకృష్ణుడుకు మాత్రం రాజ్యసభ కు వెళ్లాలని బంగా ఉంది. పార్టీలో పోటీ తీవ్రంగా ఉన్న సమయంలో యనమల రామకృష్ణుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ అధిష్టానం పోస్ట్ మార్టం చేస్తున్నట్లు సమాచారం. ఆయనను నేరుగా అడిగి తెలుసుకునే అవకాశం మాత్రం లేదు. అందుకే స్థానిక నాయకత్వం నుంచి నివేదికలను తెప్పించుకునే పనిలో ఉంది.
Next Story

