Sun Mar 15 2026 08:57:56 GMT+0530 (India Standard Time)
Yanamala resigns to TDP: టీడీపీకి యనమల కృష్ణుడు రాజీనామా
టీడీపీకి యనమల కృష్ణుడు రాజీనామా చేశారు. ఆయన పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Yanamala resigns to TDP:టీడీపీకి యనమల కృష్ణుడు రాజీనామా చేశారు. ఆయన పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో రెండు సార్లు పోటీ చేసి ఓటమి పాలయిన యనమల కృష్ణుడికి ఈసారి పార్టీ అధినాయకత్వం టిక్కెట్ ఇవ్వలేదు. తన సోదరుడు యనమల రామకృష్ణుడు కూతురు దివ్యకు టిక్కెట్ కేటాయించింది.
వైసీపీలో చేరేందుకు...
దీంతో గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న యనమల కృష్ణుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన వైసీపీలో చేరే అవకాశాలున్నాయని తెలిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో యనమల కృష్ణుడు పార్టీలో చేరతారని చెబుతున్నారు. దీంతో తుని నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలినట్లేనన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
Next Story

