Sun Mar 15 2026 21:33:18 GMT+0530 (India Standard Time)
టోల్ సిబ్బందిపై దాడి.. ఘటనలో ఎంపీపీ
అనంతపురం జిల్లాలోదారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని యర్రదొడ్డి టోల్ ప్లాజా సిబ్బందిపై కదిరి ఎంపీపీ దాడికి దిగారు.

అనంతపురం జిల్లాలోదారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని యర్రదొడ్డి టోల్ ప్లాజా సిబ్బందిపై కదిరి ఎంపీపీ దాడికి దిగారు. తన అనుచరులతో కలసి టోల్ ప్లాజాకు వచ్చినఅ అమర్ నాధ్ రెడ్డి సిబ్బందిపై దాడికి దిగారు. టోల్ ప్లాజాలో తన అనుచరులను తొలగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేయడంతో పాటు అమర్ నాధ్ రెడ్డి ఇద్దరు టోల్ సిబ్బందిని తన వెంట తీసుకెళ్లడం సంచలనంగా మారింది.
ఇద్దరు సిబ్బందిని....
అయితే టోల్ ప్లాజాపై అమర్ నాధ్ రెడ్డి దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ టీవీ పుటేజీలో లభించాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి టోల్ సిబ్బందిపై దాడికి పాల్పడిన అమర్ నాధ్ రెడ్డిని, ఆయన అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story

