Sat Mar 07 2026 21:11:01 GMT+0530 (India Standard Time)
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లను ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు అంగీకరించినట్లు తెలిసింది

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయల రుణాన్ని ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు అంగీకరించినట్లు తెలిసింది.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదించిన మేరకు అమరావతి నిర్మాణానికి పది హేను వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సూత్ర ప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఏడీబీతో కలసి...
ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ తో కలిసి ఆ మొత్తాన్ని ప్రపంచ బ్యాంకు మంజూరు చేయనున్నట్లు సమాచారం. ఆ యా బ్యాంకుల ప్రతినిధులు రేపటి నుంచి ఈ నెల 27 వరకు రాజధానిలో పర్యటించి వివిధ అంశాలపై ప్రభుత్వ ముఖ్య నేతలు, అధికారులతో చర్చించనున్నారు. వీలైనంత త్వరలోనే రుణం మంజూరు చేసే అవకాశముందని చెబుతున్నారు.
Next Story

