Sat Dec 07 2024 14:47:38 GMT+0000 (Coordinated Universal Time)
Andrha Pradesh : ఏపీలో పోస్టాఫీసులకు క్యూ కట్టిన జనం
ఆంధ్రప్రదేవ్ లో పోస్టాఫీసులకు మహిళలు క్యూ కట్టారు. దీంతో పోస్టాఫీసుల వద్ద మహిళలతో రద్దీ పెరిగింది
ఆంధ్రప్రదేవ్ లో పోస్టాఫీసులకు మహిళలు క్యూ కట్టారు. దీంతో పోస్టాఫీసుల వద్ద మహిళలతో రద్దీ పెరిగింది. బ్యాంక్ అకౌంట్లు లేనివారితో పాటు, ఆధార్ అనుసంధానం చేయని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇప్పటి వరకూ అందడం లేదు. అయితే పోస్టాఫీసుల్లో అకౌంట్లు తెరవాలన్న అధికారుల ఆదేశాలతో మహిళలు పెద్ద సంఖ్యలో పోస్టాఫీసుల వద్దకు వచ్చారు. అయితే ఇది కొందరు చేసిన ప్రచారం వల్లనే ఇలా జరిగిందని చెబుతున్నారు.
సంక్షేమ పథకాల కోసం...
బ్యాంకు లో అకౌంట్లు లేని వారే అకౌంట్లు చేయాలని కొందరు అధికారులు సూచించినప్పటికీ, పోస్టాఫీసుకు సంక్షేమ పథకాలను అందుకుంటున్న లబ్దిదారులందరూ వచ్చారు. నిన్నటి నుంచే ఏపీలోని అన్ని పోస్టాఫీసుల్లో మహిళ లబ్దిదారులు వచ్చి తమకు ఖాతా తెరవాలని కోరతున్నారని అభ్యర్థిస్తున్నారు. అయితే బ్యాంకు అకౌంట్ ఉంటే పోస్టాఫీసు ఖాతా అవసరం లేదని చెబుతున్నా వారు వినకుండా తమకు కూడా అకౌంట్ తెరవాలని పట్టుబడుతున్నారు. దీంతో ఏపీలోని పోస్టాఫీసుల వద్ద రద్దీ ఒక్కసారిగా పెరిగింది.
Next Story