Fri Dec 05 2025 13:18:05 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : తిరుమల వరకూ రాజధాని మహిళల పాదయాత్ర
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మహిళ రైతులు తిరుమల వరకూ పాదయాత్రను ప్రారంభించారు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మహిళ రైతులు తిరుమల వరకూ పాదయాత్రను ప్రారంభించారు. వెంకటపాలెం నుంచి మొదలయిన పాదయాత్ర తిరుమలకు చేరుకోనుంది. పాదయాత్రను తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. ఆంధప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో పాటు రాజధాని పనులు ప్రారంభం కావడంతో మొక్కులు తీర్చుకోవడానికి రైతులు పాదయాత్రగా బయలుదేరారు
గతంలోనూ యాత్ర చేసి...
మహిళలు గతంలోనూ తిరుమల వరకూ పాదయాత్రను చేశారు. రాజధానిగా కొనసాగించాలని కోరుతూ గతంలో యాత్ర చేసి తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామికి మొక్కుకున్నారు. ఇప్పుడు రాజధాని పనులు ప్రారంభం కావడంతో మొక్కులు చెల్లించుకోవడానికి మహిళలు పాదయాత్రగా బయలుదేరారు. దీనికి కృతజ్ఞత పాదయాత్రగా పేరు పెట్టారు. ఈ పాదయాత్ర ఇరవై రోజుల పాటు కొనసాగనుంది.
Next Story

