Fri Mar 20 2026 07:46:19 GMT+0530 (India Standard Time)
మహిళను ఆత్మహత్య నుంచి కాపాడిన వైసీపీ ఎమ్మెల్యే
వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య కు పాల్పడుతున్న మహిళను వైసీపీ ఎమ్మెల్యే ముస్తాపఫా కాపాడారు

వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య కు పాల్పడుతున్న మహిళను వైసీపీ ఎమ్మెల్యే ముస్తాపఫా కాపాడారు. ఆమెను ఆత్మహత్య చేసుకోకుండా నివారించారు. శ్రీనివాసరావుతోటకు చెందిన ఒక మహిళ మణిపురం బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఈ సమయంలో ఆఫీసు నుంచి ఇంటికి వెళుతున్న ఎమ్మెల్యే ముస్తాఫా అది గమనించి మహిళ వద్దకు చేరుకున్నారు.
కారులో ఎక్కించుకుని...
ఆమె సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆత్మహత్య చేసుకోకుండా ముస్తాఫా ఆమెను కాపాడారు. తన కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి ఇంటి వద్ద దించారు. ధైర్యంగా ఉండాలని, ఆత్మహత్య చేసుకోకూడదని ముస్తాఫా ఆమెకు నచ్చ చెప్పారు.
Next Story

