Sun Mar 08 2026 05:46:02 GMT+0530 (India Standard Time)
పెడన సీఎం సభలో మహిళ మృతి.. రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం
పెడన సభా వేదిక నుంచి నేతన్న హస్తం కింద లబ్ధిదారులకు నిధులను వారి ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి..

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం కృష్ణా జిల్లా పెడనలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. పెడన సభా వేదిక నుంచి నేతన్న హస్తం కింద లబ్ధిదారులకు నిధులను వారి ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనం హాజరవ్వగా.. సభలో అపశృతి చోటుచేసుకుంది. సభ జరుగుతుండగానే మాణిక్యమ్మ అనే మహిళ సొమ్మసిల్లి పడిపోయి అక్కడికక్కడే మృతిచెందింది.
ఈ విషయం తెలుసుకున్న పెడ ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్.. విషయాన్ని సీఎం జగన్ కు తెలిపారు. మహిళ మృతిపై విచారం వ్యక్తం చేసిన జగన్.. బాధిత మహిళ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. తక్షణమే పరిహారాన్ని అందజేయాలని మంత్రి జోగి రమేష్ ను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వేగంగా కదిలిన రమేశ్... రూ.10 లక్షల చెక్కును తక్షణమే మాణిక్యమ్మ కుటుంబానికి అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story

