Sun Mar 15 2026 21:20:37 GMT+0530 (India Standard Time)
దరిద్రాన్ని ఎవరైనా దరి చేర్చుకుంటారా?
చంద్రబాబు బీజేపీని చేరదీస్తుందా? లేదా? అన్నది బీజేపీ అంతర్గత విషయమని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు

చంద్రబాబు బీజేపీని చేరదీస్తుందా? లేదా? అన్నది బీజేపీ అంతర్గత విషయమని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన ట్విట్టర్ లో స్పందించారు. విలువల్లేని టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుని టీడీపీ తన పరిస్థిితిని మరింత దిగజార్చుకుంటుందా? లేదా? అన్నది ఆ పార్టీ నిర్ణయించుకోవాలని అన్నారు.
విలువల్లేని టీడీపీతో
విలువల్లేని టీడీపీతో పొత్తుతో బీజేపీ స్థాయి దిగాజార్చుకుంటుందన్నారు. ఎవరైనా దరిద్రాన్ని ఎవరైనా కోరి చంకన పెట్టుకుంటారా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా రామోజీరావుతో భేటీ అవ్వడంతో మళ్లీ బీజేపీ టీడీపీతో పొత్తుకు సిద్ధమయిందన్న ప్రచారం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనపడుతుంది.
Next Story

