రెండేళ్లలో 12 పెళ్లిళ్లు చేసుకుని.. అడ్డంగా దోచేసి!
ఓ వైపు పెళ్లిళ్లు అవ్వడం లేదని అబ్బాయిలు బాధపడుతూ ఉంటుంటే!! కిలేడీలు వారి జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు.

ఓ వైపు పెళ్లిళ్లు అవ్వడం లేదని అబ్బాయిలు బాధపడుతూ ఉంటుంటే!! కిలేడీలు వారి జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. కోనసీమ జిల్లా రామచంద్రపురం ప్రాంతానికి చెందిన బేతి వీర దుర్గనీలిమ అనే యువతి రెండేళ్లలో ఏకంగా 12 పెళ్లిళ్లు చేసుకుంది. ఆమె, మరో ముగ్గురు సభ్యులతో కలిసి ముఠాగా ఏర్పడింది. అలా రెండేళ్లలో 12 మందిని పెళ్లి చేసుకుంది. భార్యతో విభేదాలు వచ్చి కోర్టు చుట్టూ తిరుగుతున్న వాళ్లు, పెళ్లికాని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ధనవంతులను వీరు టార్గెట్ చేస్తారు. పెళ్లి చేసుకునే వరకు నీలిమ ఎంతో మంచిగా నటించేది. నీలిమ కుటుంబ సభ్యులుగా దుర్గ అనే మహిళ, వీరలక్ష్మి, కళ్యాణ్ అనే వ్యక్తులు నాటకాన్ని రక్తి కట్టించేవారు. పెళ్లి చేసుకున్న తర్వాత నీలిమ అత్తవారి ఇంటికి వెళ్లేది కాదు. భర్త ఎదురుతిరిగితే కేసులు పెడతామని బెదిరించేది. రహస్య పెళ్లి, కాపురానికి సంబంధించిన ఫొటోలు దగ్గర పెట్టుకుని, బ్లాక్మెయిల్ చేసి లక్షల్లో దోచుకున్నారు.

