Thu Mar 19 2026 18:26:11 GMT+0530 (India Standard Time)
చంద్రబాబుపై మమత సంచలన కామెంట్స్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేశారని మమత బెనర్జీ ఆరోపించారు. ఆమె బెంగాల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కొనుగోలు చేసింది వాస్తవమే....
పెగాసస్ సాఫ్ట్ వేర్ ను 25 కోట్ల రూపాయలకు విక్రయిస్తామంటూ తమ పోలీసులను వారు సంప్రదించారని మమత బెనర్జీ చెప్పారు. అయితే తాను తిరస్కరిచండంతో ఆ సాఫ్ట్ వేర్ ను ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కొనుగోలు చేశారని మమత బెనర్జీ చెప్పారు.
Next Story

