Thu Mar 19 2026 04:41:41 GMT+0530 (India Standard Time)
Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇబ్బందులు తప్పవా
ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రాబోయే నాలుగైదు

weather update: ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రాబోయే నాలుగైదు రోజులు పొగమంచు ఎక్కువగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం వేళలో పొగ మంచు కారణంగా ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని.. ఈ సమయంలో ప్రయాణాలు చేసే వారు కాస్త జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇక ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక సముద్రమట్టానికి 1.5 కి.మీ ఎత్తులో దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి.. దానికి అనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుందని ఐఎండీ వివరించింది. ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, సీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అకాశం ఉందని తెలిపింది. మరికొన్నిచోట్ల ఉరుములతో కూడి జల్లులు పడుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోతున్నాయి. చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. ఇవాళ, రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో పొగమంచు పరిస్థితులు అధికంగా ఉంటుందని హెచ్చరించింది.
Next Story

