Fri Dec 05 2025 21:50:36 GMT+0000 (Coordinated Universal Time)
శివశంకర్ స్పృహ కోల్పోయాడనుకున్నాం
కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసు అధికారులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.

కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసు అధికారులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. పలు సీసీటీవీ ఫుటేజిలను విశ్లేషిస్తున్నారు. శివశంకర్ ద్విచక్రవాహనం ప్రమాదానికి గురైన సుమారు పది నిమిషాల తరువాత వేమూరి ట్రావెల్స్ బస్సు దాన్ని ఢీకొట్టినట్లు గుర్తించారు. కొన్ని వాహనాల డ్రైవర్లతోనూ, మరికొందరితోనూ మాట్లాడారు. ద్విచక్రవాహనం రోడ్డుపై ఉండటాన్ని తాము చూశామని, దాని పక్క నుంచి వెళ్లిపోయామని వారు చెప్పారు. శివశంకర్ మృతదేహాన్ని ఎర్రిస్వామి పక్కకు లాగిన దృశ్యాన్ని కూడా చూసినట్లు తెలిపారు. శివశంకర్ చనిపోయాడని తాము అనుకోలేదని, ప్రమాదంలో స్పృహ కోల్పోతే పక్కకు లాగుతున్నట్లు భావించామని పోలీసులకు వివరించారు.
Next Story

