Sat Dec 13 2025 22:35:49 GMT+0000 (Coordinated Universal Time)
వరంగల్ బిషప్ తుమ్మ బాల హఠాన్మరణం
వరంగల్ బిషప్ తుమ్మ బాల ఈరోజు తుది శ్వాస విడిచారు,తుమ్మ బాల వయసు 80 సంవత్సరాలు.

వరంగల్ బిషప్ తుమ్మ బాల ఈరోజు తుది శ్వాస విడిచారు. ఉదయం 10.25 గంటలకు డియోసిస్ బిషప్ మోస్ట్ రెవ. తుమ్మ బాల మృతి చెందారు. ఆయన మృతితో ఒక సున్నిత, మంచి వ్యక్తిని కోల్పోయినట్లయింది. తుమ్మ బాల వయసు 80 సంవత్సరాలు. ఆయన ఎంతో కష్టపడి, అంకిత భావంతో పనిచేసి ఈ స్థాయికి చేరుకున్నారు.
పలువురు సంతాపం...
తుమ్మ బాల హైదరాబాద్ ఆర్చ్ బిషప్ ఎమిరిటస్ మరియు వరంగల్ బిషప్ ఎమిరిటస్ గా ఉన్నారు. తుమ్మ బాల మృతి పట్ల డియోసిస్ లోని పలువురు తన సంతాన్ని ప్రకటించారు. తుమ్మ బాల అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయన్నది త్వరలోనే తెలియపరుస్తామని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని ప్రార్థనలు జరుగుతున్నాయి.
Next Story

