Sun Dec 14 2025 02:34:11 GMT+0000 (Coordinated Universal Time)
ఇద్దరిలో రాళ్లతో కొట్టేది ఎవరిని?
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో ఎంపీ రఘురామ కృష్ణరాజు మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతూనే ఉంది

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో ఎంపీ రఘురామ కృష్ణరాజు మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతూనే ఉంది. విజయసాయిరెడ్డి ట్వీట్ కు రఘురామ కృష్ణరాజు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా విజయసాయరెడ్డి రాజుపై ట్వీట్ చేశారు. "ఎవరి మెప్పుకోసమో విప్పుకు తిరిగే స్థాయి దిగజారావా రఘురామా? నలభై ఏళ్ల అనుభవమే ఈ వయసులో పక్క వాళ్లకు ప్రేమ బాణాలు వేస్తుంటే అతడి ప్రేమ కోసం పడరాని పాట్లు పడుతున్నావా? పనిచేసే వారికే పట్టం కడతారు ప్రజలు. ఢిల్లీలో కూర్చుని కాకమ్మ కబుర్లు చెబితే వాళ్లే రాళ్లతో కొడతారు" అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ఈయన కూడా....
దీనికి ఎంపీ రఘురామ కృష్ణరాజు ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. " నువ్వు నీ ప్రేమ బాణాలను విశాఖ నవ యువతుల మీద విసురుతున్నావంట కదా? పని చేయకుండా ప్రజలను పీక్కుతింటున్న మిమ్మల్ని త్వరలో ఆ ప్రజలే రాళ్లతో్ కొడతారు. నువ్వు ఎన్ని ట్వీట్లు పెట్టినా ఏ 1 నీకు రాజ్యసభ రెన్యువల చేయ్యడంట కదా? ముందు నువ్వు ఏ 1 చేతిలో తన్నులు తినకుండా ఉండేలా చూసుకో" అని రఘురామ కృష్ణరాజు కౌంటర్ ఇచ్చారు.
Next Story

