Sat Dec 07 2024 03:08:34 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబుపై పిల్ దాఖలు చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కష్టాలు మరింత పెరుగుతున్నాయి. రాజమండ్రి మాజీ ఎంపీ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కష్టాలు మరింత పెరుగుతున్నాయి. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా కోర్టును ఆశ్రయించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ఆయన కోరారు. 44 మందిని విచారణ కోసం హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని కోరుతూ ఉండవల్లి అరుణ్ కుమార్ 44 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ రిట్ పిటీషన్ దాఖలు చేశారు. రిట్ నెంబర్:-38371/2023 ప్రకారం హైకోర్టు రిజిస్ట్రార్ కేసు నమోదు చేసారు.
ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఏపీ సీఐడీ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరింది. ఈ కేసులో చంద్రబాబును ఏ1 ముద్దాయిగా పేర్కొంది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీనిని న్యాయస్థానం ఈ నెల 26న విచారించనుంది.
Next Story