Fri Dec 06 2024 16:45:05 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికల సమ్మె వాయిదా
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు తాము తలపెట్టిన సమ్మెను వాయిదా వేసుకున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు తాము తలపెట్టిన సమ్మెను వాయిదా వేసుకున్నారు. నిజానికి రేపటి నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు కార్మికులు నోటీసులు ఇచ్చారు. వేతన సవరణ ఒప్పందం అమలు కోసం కార్మిక శాఖకు వారు ఈ నోటీసులు ఇచ్చారు. అయితే కార్మిక సంఘాలతో కార్మిక శాఖ చర్చలు జరిపింది. వేతన సవరణ ఒప్పందం విషయంలో కార్మికుల డిమాండ్లను పరిశీలించి అనుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.
వేతన ఒప్పందం....
దీంతో కార్మికులు కూడా వెనక్కు తగ్గారు. తాము ఈ నెల 31వ తేదీ నుంచి తలపెట్టిన సమ్మెను వాయిదా వేసుకుంటున్నట్లు కార్మిక సంఘాలు వెల్లడించాయి. ఆమోదయోగ్యమైన నిర్ణయం సమావేశంలో వచ్చిందని చెప్పారు. దీంతో పాటు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కూడా సమ్మెను వాయిదా వేశామని వారు తెలిపారు.
Next Story