Sat Dec 13 2025 22:31:05 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert : లేటెస్ట్ రెయిన్ అలెర్ట్
నేడు, రేపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది

బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుందని, రేపటి వరకు అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది. నేడు, రేపు ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీరం వెంట గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో 40-ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది.
తెలంగాణలో ఈ జిల్లాలకు...
తెలంగాణకు నాలుగు రోజలపాటు వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నల్లొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, నారాయణపేట, వనపర్తి, గద్వాల్ జిల్లాలో అక్కడకక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
Next Story

