Sat Dec 07 2024 01:16:24 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ వైసీపీ మైండ్ గేమ్
వైసీపీ మైండ్ గేమ్ ప్రారంభించిందని విశాఖ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.
వైసీపీ మైండ్ గేమ్ ప్రారంభించిందని విశాఖ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. తన రాజీనామాను ఆమోదించినట్లు ప్రచారం చేస్తుందని తెలిపారు. వైసీపీలో ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలను భయపెట్టడానికి వైసీపీ ఇలాంటి మైండ్ గేమ్ లను ప్రారంభించిందన్నారు. రాజీనామా ఆమోదించాలంటే తనను పిలిపించి తన ఆలోచన తెలుసుకున్న తర్వాతనే ఆమోదించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
రాజీనామాను ...
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇటువంటి మైండ్ గేమ్ లు ఆడి వైసీపీలో ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునే ప్లాన్ లో భాగంగా ఈ మైండ్ గేమ్‌ను ప్రారంభించిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసి సంవత్సరాలు గడుస్తున్నా స్పీకర్ ఆయన రాజీనామాను ఆమోదించలేదు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆయన రాజీనామా ఆమోదం పొందినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Next Story