Fri Mar 27 2026 10:25:34 GMT+0530 (India Standard Time)
4 గంటల్లోగా విశాఖ విడిచి వెళ్లండి.. పవన్ కు నోటీసులు
సాయంత్రం 4 గంటల్లోగా విశాఖ విడిచి వెళ్లాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను విశాఖ పోలీసులు ఆదేశించారు

సాయంత్రం 4 గంటల్లోగా విశాఖ విడిచి వెళ్లాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను విశాఖ పోలీసులు ఆదేశించారు. ఈ మేరకు 41 ఎ నోటీసులు జారీ చేశారు. పవన్ కల్యాణ్ తో పాటు జనసేన నేతలకు కూడా ఈనోటీసులు జారీ చేశారు. పవన్ కల్యాణ్ విశాఖలో మూడు రోజుల పర్యటనకు వచ్చారు. అయితే నిన్న మంత్రులపై జనసైనికులు దాడి చేయడం, పోలీసులు కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగిపోయాయి.
జనవాణిని వాయిదా...
దీంతో పవన్ కల్యాణ్ ఈరోజు జరిగే జనవాణి కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. తాను అరెస్టయిన కార్యకర్తల కోసం పోలీస్ స్టేషన్ కు వస్తారని ట్వీట్ చేశారు. దీంతో నోవాటెల్ కు పెద్దయెత్తున జనసేన కార్యకర్తలు చేరుకుంటున్నారు. విశాఖలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశముందని భావించిన పోలీసులు ఆయనను సాయంత్రం నాలుగు గంటల్లోగా విడిచి పెట్టి వెళ్లాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Next Story

