Sun Mar 15 2026 11:34:58 GMT+0530 (India Standard Time)
నేడు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్
నేడు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.

నేడు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించిన నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. ఈ నెల 13వ తేదీ వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. 16వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణకు వీలుంటుంది. ఈ నెల 30వ తేదీన ఎన్నిక జరగనుంది.
అధికార, ప్రతిపక్ష పార్టీలు...
దీంతో ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. వైసీపీ ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించింది. నేడు టీడీపీ కూటమి తన అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశముంది. పీలా గోవింద్ పేరును ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీకి 600కు పైగా ఓట్లు ఉండగా, టీడీపీ కూటమికి 250 ఓట్లున్నాయి. దీంతో క్రాస్ ఓటింగ్ జరుగుతుందా? అన్న టెన్షన్ వైసీపీలో నెలకొంది. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Next Story

