Sat Mar 07 2026 16:15:39 GMT+0530 (India Standard Time)
నేడు పాఠశాలలకు సెలవు
జిల్లా కలెక్టర్ పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించారు

జిల్లా కలెక్టర్ పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా పాఠశాలలు ఈరోజు మూసివేస్తున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలన్నీ మూసివేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రయివేటు పాఠశాలలు తెరిచినా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.
భారీ వర్షాలతో...
విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో స్కూళ్లకు సెలవులు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇది గమనంలోకి తీసుకోవాలని ఆయన కోరారు.
Next Story

