Thu Mar 19 2026 04:28:47 GMT+0530 (India Standard Time)
ధూళిపాళ్ళ కారు ధ్వసం.. ఉద్రిక్తత
మట్టి తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను గ్రామస్థులు అడ్డుకున్నారు.

గుంటూరు జిల్లా అనమర్లపూడిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మట్టి తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను గ్రామస్థులు అడ్డుకున్నారు. వారిని వైసీపీ కార్యకర్తలుగా టీడీపీ నేతలు చెబుతున్నారు. మట్టి తవ్వకాలను అక్రమంగా జరుపుతున్నారంటూ టీడీపీ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అక్కడకు వెళ్లారు. అయితే అక్కడ అడ్డుకుని ఆయన కారుపై దాడికి దిగారు.
మట్టి తవ్వకాలను...
ధూళ్లిపాళ్ల నరేంద్ర మట్టి తవ్వకాల పరిశీలనకు వెళ్లకుండా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాకుండా, ఆయన వచ్చిన కారును కూడా ధ్వంసం చేశారని చెబుతున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

