Sat Jan 31 2026 19:10:45 GMT+0000 (Coordinated Universal Time)
Kesineni Nani : అమరావతిలో చంద్రబాబు అసలు ప్లాన్ అదే
అమరావతి విషయంలో చంద్రబాబు తనను అడగలేదని, ఎవర్నీ సంప్రదించలేదని విజయవాడ వైసీపీ అభ్యర్థి కేశినేని నాని అన్నారు

అమరావతి విషయంలో చంద్రబాబు తనను అడగలేదని, ఎవర్నీ సంప్రదించలేదని విజయవాడ వైసీపీ అభ్యర్థి కేశినేని నాని అన్నారు. చంద్రబాబు, ఆయన కొడుకు లోపల కూర్చుని నిర్ణయాలు తీసుకున్నారన్నారని ఆరోపించారు. వారి నిర్ణయాలనే చివరకు అమలు చేశారన్న కేశినేని నాని,రాజధాని అంశంలో చంద్రబాబు తప్పు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన వాళ్లకు నాడే...
పెట్టుబడి పెట్టకండి, నష్టపోతారని తమ వాళ్లను అప్పుడే హెచ్చరించానని కేశినేని నాని తెలిపారు. యాభై సంవత్సరాలకు కూడా విజయవాడ నగరంగా డెవలప్ అవదని చెప్పానని, జయవాడ, గుంటూరును పాత నగరాల్లాగే వుంచి,అమరావతిలోని ఆ 29 గ్రామాలను రియల్ ఎస్టేట్‌గా మార్కెట్ చేసుకోవాలని చంద్రబాబు ప్లాన్ అని కేశినేని నానిఅన్నారు.
Next Story

