Fri Dec 05 2025 14:33:20 GMT+0000 (Coordinated Universal Time)
Pothina Mahesh : పోతిన మహేష్ ఆశలు నెరవేరవా? అంతా వృథా ప్రయాసేనా?
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ నేత పోతిన మహేష్ ఆశలు నెరవేరేటట్లు కనిపించడం లేదు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ నేత పోతిన మహేష్ కు జగన్ హామీ ఇచ్చారా? ఆయన పార్టీలో చేరిన నాటి నుంచి అధికారం కోల్పోయినతర్వాత కూడా యాక్టివ్ గానే ఉన్నారు. పోతిన మహేష్ నిజంగానే జనసేనలో ఉండి ఉంటే ఏదో ఒక పదవి లభించేది. కానీ పోతిన మహేష్ మాత్రం తాను ఎమ్మెల్యేగానే అవ్వాలనుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో నిజంగా జనసేన టిక్కెట్ పశ్చిమ నియోజకవర్గం నుంచి దక్కి ఉంటే జనసేన ఎమ్మెల్యేగా గెలిచేవారేమో. కానీ బ్యాడ్ లక్ .. పొత్తులో భాగంగా పశ్చిమ నియోజకవర్గం బీజేపీకి వెళ్లిపోయింది. దీంతో ఆయనకు టిక్కెట్ దక్కకపోవడంతో ఆవేశంతో పార్టీ నుంచి బయటకు వచ్చారు. పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
గ్యారంటీ లేకుండానే...
వైసీపీలో టిక్కెట్ వస్తుందన్న గ్యారంటీ ఏమీ లభించకుండానే పార్టీలో చేరిపోయారు. పోతిన మహేష్ కు ఎమ్మెల్యే కావాలన్నది బలమైన కోరిక. తనకున్న మాజికవర్గం బలం కూడా తనకు చేదోడు వాదోడుగా ఉంటుందని ఆయన భావిస్తారు. కానీ పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ టీడీపీ గెలవకపోవడంతో దానిపై ఆశలు పెట్టుకుని వైసీపీలోకి జంప్ అయినా ఆయనకు టిక్కెట్ లభించలేదు. షేక్ ఆసిఫ్ కు వైసీపీ అధినేత టిక్కెట్ ఇచ్చారు. 2019 లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన వెల్లంపల్లి శ్రీనివాస్ ను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి పంపారు. అయితే మొన్నటి ఎన్నికల్లో కృష్ణా జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసేసింది.
ముగ్గురు పోటీ ...
ఇక 2024 ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి తిరిగి వెల్లంపల్లి శ్రీనివాస్ రెడీ అవుతున్నారు. తనకు సెంట్రల్ నియోజకవర్గం కంటే తన సొంత నియోజకవర్గమైన పశ్చిమకే వెళతానని పట్టుబడుతున్నారు. మరొకవైపు సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు పోటీ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇక గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన షేక్ ఆసిఫ్ తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరతారు. ఇలా ఒక నియోజకవర్గానికి ముగ్గురు పోటీ పడుతుండటంతో ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో పోతిన మహేష్ కు వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ టిక్కెట్ కేటాయించే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. మరి పోతిన పార్టీని వీడి ఏం సాధించినట్లు అన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story

