Sat Dec 06 2025 00:45:26 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : వైసీపీలో చేరిన పోతిన మహేష్
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన నేత పోతిన మహేష్ వైసీపీలో చేరారు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన నేత పోతిన మహేష్ వైసీపీలో చేరారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి తనకు సీటు దక్కకపోవడంతో ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా పవన్ కల్యాణ్ పై కీలక విమర్శలు చేశారు.
జగన్ సమక్షంలో....
ఈరోజు వైసీపీలో పోతిన మహేష్ చేరారు. తన అనుచరులతో కలసి వైఎస్ జగన్ బస చేసిన గంటావారిపాలెం వద్దకు వెళ్లిన పోతిన మహేష్ వైసీపీలో చేరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ గెలుపునకు తాను కృషి చేస్తానని ఈ సందర్బంగా పోతిన మహేష్ తెలిపారు. మరో వైపు మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి కూడా వైసీపీలో చేరారు.
Next Story

