Fri Dec 05 2025 17:47:02 GMT+0000 (Coordinated Universal Time)
రాధా హత్యకు రెక్కీపై పోలీస్ కమిషనర్ రెస్పాన్స్ ఇదే
తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధా రెక్కీ విషయంపై విజయవాడ పోలీసు కమిషనర్ క్రాంతి రాణా స్పందించారు

తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధా రెక్కీ విషయంపై విజయవాడ పోలీసు కమిషనర్ క్రాంతి రాణా స్పందించారు. తమకు రాధా రెక్కీ విషయంలో ఎలాంటి ఆధారాలు దొరకలేదని క్ారంతి రాణా చెప్పారు. రెక్కీ ఘటన పై పూర్తి స్థాయి విచారణ చేస్తున్నామని పోలీస్ కమిషనర్ తెలిపారు. రెండు నెలల సీసీ టీవీ ఫుటేజ్ ను ప్రస్తుతం పరిశీలిస్తామని క్రాంతి రాణా తెలిపారు.
ఫిర్యాదు అందలేదు....
వంగవీటి రాధా హత్యకు రెక్కీ విషయంలో తమకు ఎలాంటి ఫిర్యాదుల అందలేదని క్రాంతి రాణా తెలిపారు. అయితే రాధా భద్రతకు పూర్తి భరోసా ఇస్తున్నామని చెప్పారు. ఎవరైనా ఈ అంశంపై ఎలాంటి ఊహాగానాలు చేసి, తప్పుడు ప్రచారాలు చేసి శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని క్రాంతి రాణా హెచ్చరించారు.
Next Story

