Sun Mar 15 2026 13:40:52 GMT+0530 (India Standard Time)
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ ఇంటివద్దకు ఏపీ పోలీసులు
హైదరాబాద్ లోని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటికి విజయవాడ పోలీసులు వచ్చారు

హైదరాబాద్ లోని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటికి విజయవాడ పోలీసులు వచ్చారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను తనిఖీ చేయనున్నారు. వంశీ ఫోన్ కోసం ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. వంశీ ఇంటికి ఎవరెవరు వచ్చి వెళ్లారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
సీసీ టీవీ ఫుటేజీ ద్వారా...
సీసీ టీవీ ఫుటేజీ ద్వారా ఆధారాలను సేకరించే ప్రయత్నంలో విజయవాడ పోలీసులున్నారు. మరోవైపు విజయవాడ జిల్లా జైలులో ఉన్న వల్లభనేని వంశీని ఆయన భార్య పంకజ శ్రీ ములాఖత్ అయ్యారు. విజయవాడ పోలీసుల నుంచి వంశీకి ప్రాణహాని ఉందని చెప్పారు. వంశీకి రక్షణ కల్పించాలని పంకజ శ్రీ డిమాండ్ చేస్తున్నారు.
Next Story

