Tue Mar 17 2026 04:45:46 GMT+0530 (India Standard Time)
నా అన్న పేరు నేను ఎప్పుడూ వాడలేదు
విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి కేశినేని చిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి కేశినేని చిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేశినేని నాని తనపై దొంగ కేసులు పెట్టారన్నారు. తాను బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టలేదని, ప్రజలను మోసం చేయలేదన్నారు. కేశినేని నానికి మైండ్ పనిచేయడం లేదన్నారు. తాను ఎక్కడా కేశినేని నాని తమ్ముడు అని చెప్పుుకోనని అన్నారు. ఎంపీ నెంబర్ ప్లేట్ ను కారుకు వాడానంటూ తనపై కేసు నమోదు చేయించి, వేధింపులకు గురి చేశాడని కేశినేని చిన్ని అన్నారు.
తనవల్లనే గెలిచానని...
కేశినేని నాని ఒకసారి అమరావతి కావాలంటారని, మరొకసారి అవసరం లేదని అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిపిస్తే ప్రజలకు ఆయన చేసిందేమీ లేదన్నారు. పార్టీ గుర్తుపై గెలిచి తన వల్లనే గెలిచానని భ్రమలో కేశినేని నాని అనుకుంటున్నారని కేశినేని నేని చిన్ని అన్నారు. ఈసారి కేశినేని నానిని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టిక్కెట్ ఆయనకు ఎందుకు ఇవ్వలేదో ఆలోచించుకుంటే మంచిదని సూచించారు.
Next Story

