Sun Mar 15 2026 16:35:15 GMT+0530 (India Standard Time)
Kesineni Nani: కేశినేని నాని సంచలన ప్రకటన
కేశినేని నాని సంచలన ప్రకటన.. విజయవాడలో అసలు ఆట మొదలైంది

KesineniNani: విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు.. త్వరలోనే లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు.. తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేయనున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
"చంద్రబాబు నాయుడు పార్టీకి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదు అని నా భావన .. కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ ని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తున్నాను" అని సంచలన ట్వీట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన కేశినేని.. టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత నుంచి చంద్రబాబును నేరుగా టార్గెట్ చేయబోతున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు, భారతీయ జనతా పార్టీతో కేశినేని నానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
Next Story

