Sat Jan 31 2026 21:35:21 GMT+0000 (Coordinated Universal Time)
కేశినేని ఘాటు వ్యాఖ్యలు... టీడీపీ అధికారంలోకి రాదన్న నాని
విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలోనూ టీడీపీ అధికారంలోకి రాలేదని చెప్పారు

విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలోనూ టీడీపీ అధికారంలోకి రాలేదు. గెలిచే శక్తి, యుక్తి చంద్రబాబుకు లేదని కేశినేని అన్నారు. ఆఫ్ ది రికార్డ్ లో విలేకర్లతో చిట్ చాట్ చేస్తూ కేశినేని నాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ యాభై నుంచి అరవై సీట్లు వచ్చినా ఏక్నాథ్ షిండేలా సిఎం రమేష్ ఉన్నారన్నారు. సీఎం రమేష్ తో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చేయిస్తుందని కేశినేని నాని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు నమ్మేది...
తాను ఉన్నది ఉన్నట్లుగా చెబుతానని, అలాంటి వాళ్ల మాటలను చంద్రబాబు నమ్మబోరని కేశినేని నాని అన్నారు. బ్రోకర్లు, లోఫర్ల మాటలనే చంద్రబాబు నమ్ముతారన్నారు. తనకు రాజకీయాల్లో కొనసాగే ఆసక్తి లేదని కేశినేని నాని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ వచ్చే అవకాశమే లేదని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ పోస్ట్ మార్టం చేయటం ప్రారంభించింది. కేశినేని నాని ఆఫ్ ది రికార్డులో ఆ వ్యాఖ్యలు చేశారా? లేదా? అన్న దానిపై ఢిల్లీ విలేకర్లను ఆరా తీస్తుంది.
Next Story

