Fri Mar 20 2026 10:22:35 GMT+0530 (India Standard Time)
ఎంపీ కేశినేని నాని దుర్మార్గుడు
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానిపై ఆయన బాబాయి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానిపై ఆయన బాబాయి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కేశినేని భవన్ పక్కన ఉన్న తన ఆస్తిని నాని కొట్టేయాలని ప్లాన్ వేశాడని ఆయన బాబాయి నాగయ్య ఆరోపించారు. కేశినేని నానితో అధికారులు కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. తన ఆస్తి తనకు దక్కకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని కేశినేని నాని బాబాయి నాగయ్య హెచ్చరించారు.
బాబాయి ఆరోపణలు...
వెంటనే కేశినేని నాని తన స్థలంలో నిర్మిస్తున్న భవన నిర్మాణాన్ని నిలిపేయాలని ఆయన కోరారు. తాను ఊళ్లో లేనప్పుడు కేశినేని నాని భవన నిర్మాణం చేపట్టారని తెలిపారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లోని టౌన్ ప్లానింగ్ అధికారులు కేశినేని నానితో కుమ్మక్కయ్యారని, తన స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా తిరిగి తనకు నోటీసులు ఇప్పించారని నాగయ్య పేర్కొన్నారు. కేశినేని నాని దుర్మార్గుడని, తన ఆస్తిని లాగేసుకోవాలని చూస్తున్నాడని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు.
Next Story

