Sat Dec 06 2025 02:10:54 GMT+0000 (Coordinated Universal Time)
దొరికిన చోటల్లా అప్పులే
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అప్పులు చేస్తూ కాలం గడిపేస్తుందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని అన్నారు

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అప్పులు చేస్తూ కాలం గడిపేస్తుందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని అన్నారు. లోక్ సభలో కేశినేని నాని రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పే అంశంపై మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం రోజురోజుకూ అప్పుల ఊబిలో కూరుకుపోతుందన్నారు. దొరికిన చోటల్లా అప్పులు చేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చేలా వ్యవహరిస్తుందని కేశినేని నాని ఆరోపించారు.
ఆర్థిక క్రమశిక్షణ పాటించేలా...
అలాగే అప్పులు చేయడానికి అమరావతి భూములను కూడా తాకట్టు పెట్టారని కేశినేని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసిందన్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించేలా ఏపీ ప్రభుత్వంపై కేంద్రం చర్యలు తీసుకోవలని కేశినేని నాని అభ్యర్థించారు. విభజన హామీలను అమలు చేసి ఏపీని ఆదుకోవాలని కేంద్రాన్ని కేశినేని నాని కోరారు.
Next Story

