Sun Dec 14 2025 02:00:11 GMT+0000 (Coordinated Universal Time)
వారే రాధా హత్యకు కుట్ర చేశారు
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వంగవీటి రాధాను కలసి సంఘీభావాన్ని ప్రకటించారు.

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వంగవీటి రాధాను కలసి సంఘీభావాన్ని ప్రకటించారు. వంగవీటి రాధా ప్రజల్లో నిత్యం తిరిగే వ్యక్తి అని ఆయన తెలిపారు. హుందాగా రాజకీయాలు చేసే అలవాటున్న రాధా హత్యకు కుట్ర చేయడం దారుణమని కేశినేని నాని అభిప్రాయపడ్డారు. రెక్కీ చేసింది ఎవరో తెలిసినా పోలీసులు ఇంతవరకూ తాను పట్టించు కోవడం లేదన్నారు.
లైట్ గా....
పోలీసులు రాధా విషయాన్ని లైట్ గా తీసుకుంటున్నారన్నారు. టీడీపీ రాజకీయం చేస్తుందనడటంలో వాస్తవం లేదని కేశినేని నాని తెలిపారు. టీడీపీ కార్యాలయంపై, పట్టాభి ఇంటిపై దాడి చేసిన వారే రాధా హత్యకు కుట్ర పన్నారని పరోక్షంగా దేవినేని అవినాష్ పై కామెంట్స్ చేశారు కేశినేని నాని.
Next Story

