Tue Feb 03 2026 18:49:58 GMT+0000 (Coordinated Universal Time)
Kesineni Chinni : మా కుటుంబంలో విభేదాలు ఈనాటివి కావు
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి ఆయన సోదరుడు కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి ఆయన సోదరుడు కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. తన కుటుంబంలో ివిభేదాలు ఈనాటివి కావని, 1999 నుంచి ఉన్నాయన్నారు. కానీ తానే అన్నింటికీ సర్దుకుంటూ వస్తున్నానని చిన్ని చెప్పారు. తమ కుటుంబంలో విభేదాలకు, చంద్రబాబుకు సంబంధం లేదని ఆయన అన్నారు. నందమూరి, నారా కుటుంబాలను వ్యక్తిగతంగా దూషించే స్థాయి కేశినేని నానికి లేదని ఆయన అన్నారు.
రాజకీయ బిక్ష పెట్టింది...
నానికి రాజకీయ బిక్ష పెట్టింది చంద్రబాబు మాత్రమేనని అన్నారు. తన స్థాయికి తగిన విధంగా మాట్లాడితే బాగుంటుందని అని ఆయన అభిప్రాయపడ్డారు. ఎందరో నేతలు టీడీపీని వీడిపోయినా పార్టీకి ఏమీ కాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కేశినేని చిన్ని హితవు పలికారు. వచ్చే వాళ్లు వస్తుంటారు.. పోయేవాళ్లు పోతుంటారని, కానీ టీడీపీని ఏ మాత్రం ఏమీ చేయలేకపోయారని అన్నారు. తెలంగాణలో రేవంత్, సీతక్కను చూసి నేర్చుకోవాలని, వారు చంద్రబాబును ఒక్క మాట కూడా అనని విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
Next Story

