Sat Mar 07 2026 23:19:35 GMT+0530 (India Standard Time)
గోరంట్లపై కేశినేని రెస్పాన్స్ ఇదే
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించారు

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించారు. ఆ వీడియో అంశం ప్రయివేటు వ్యవహారం కాదన్నారు. మహిళలకు సంబంధించిన అంశమని, రాజకీయ నేతలు క్లీన్ గా ఉండాలని కేశినేని నాని అన్నారు. విజయవాడలోని కేశినేని భవన్ లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
అసంతృప్తితో లేను...
తాను తెలుగుదేశం పార్టీలో అసంతృప్తిగా లేనని ఆయన అన్నారు. తాను ఎంపీగా ఉన్నా లేకపోయినా విజయవాడ ప్రజలకు ఎలాంటి నష్టం ఉండబోదన్నారు. మీడియా అనసవరంగా తన విషయంపై ఫోకస్ పెట్టడం మానాలని ఆయన అన్నారు. తన లాంటి వారు అనేక మంది వస్తారని కేశినేని అభిప్రాయపడ్డారు. ఎంపీ స్టిక్కర్ తాను మాత్రమే వాడతానని, తన కుటుంబ సభ్యులకు కూడా దానిని ఇవ్వనని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Next Story

