Fri Dec 05 2025 18:20:56 GMT+0000 (Coordinated Universal Time)
Breaking " జెండానే పీకి పారేశా... ఇక అందులో నో డిస్కషన్
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజీనామా చేస్తానని చెప్పిన తర్వాత అందులో డిస్కషన్ ఏమీ ఉండదని చెప్పారు. తిరువూరులో మరికొద్దిసేపట్లో జరగనున్న సభలో కేశినేని నానికి స్వాగతం చెబుతూ బ్యానర్లు కట్టడం, వేదికపై ఒక సీటు కేటాయించడంపై ఆయన స్పందించారు. తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించానని చెప్పారు. అది టెక్నికల్ గా ఆలస్యం కావచ్చేమో కాని ఎంపీ పదవికి రాజీనామా చేయడం ఖాయమని ఆయన అన్నారు.
ప్రొటోకాల్ కోసమే...
త్వరలోనే తెలుగుదేశం పార్టీకి కూడా తాను రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తన కార్యాలయంపై ఉన్న జెండాను కూడా తీసేశానని, ఒక్క బోర్డును మాత్రమే ఉంచానని కేశినేని నాని అన్నారు. తాను తిరువూరు సభకు వెళ్లడం లేదని చెప్పుకొచ్చారు. తనను రావద్దని చెప్పిన తర్వాత తాను అక్కడకు ఎందుకు వెళతానని ఆయన ప్రశ్నించారు. తనకు ప్రొటోకాల్ ఇచ్చామని చెప్పుకోవడానికే తిరువూరులో బ్యానర్లు ఏర్పాటు చేసి, వేదికపై కుర్చీ వేసి ఉంటారని ఆయన తెలిపారు.
Next Story

