Fri Dec 05 2025 13:16:18 GMT+0000 (Coordinated Universal Time)
Kesineni Nani : చంద్రబాబు పోటీ చేసినా నాదే గెలుపు
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చంద్రబాబు పోట ీచేసినా రెండు లక్షల మెజారిటీతో విజయం సాధిస్తానని అన్నారు. చంద్రబాబు అమరావతి పేరుతో 29 వేల మంది రైతులను దగా చేశారన్న నాని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ బినామీ పేరుతో భూములను సంపాదించారన్నారు.
బాబు అక్రమాలను...
చంద్రబాబు అక్రమాలను తాను బయటపెడతానని తెలిపారు. విజయవాడలో మరోసారి తన విజయం ఖాయమని తెలిపారు. ప్రజలు చంద్రబాబు పాలన చూశారని, జగన్ పాలనను కూడా చూశారని, అయితే జగన్ పాలనలో జరుగుతున్న సంక్షేమం అభివృద్ధితో వైసీపీ అభ్యర్థులు కృష్ణా జిల్లాలో అత్యధిక స్థానాలను గెలుచుకుంటామని ఆయన అన్నారు.
Next Story

