Sat Dec 06 2025 02:11:24 GMT+0000 (Coordinated Universal Time)
వైరల్ అవుతున్న మేయర్ లేఖ
విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి థియేటర్ల యాజమాన్యాలకు రాసిన లేఖ వివాదంగా మారింది

విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి థియేటర్ల యాజమాన్యాలకు రాసిన లేఖ వివాదంగా మారింది. ఒక మేయర్ స్థానంలో ఉండి కొత్త సినిమా టిక్కెట్లు ఇవ్వమంటూ ఆమె రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మేయర్ గా ఎంపికయింది ప్రజా సమస్యలను పరిషకరించడానికి తప్ప, సినిమాలను ఫస్ట్ రోజే చూడటానికి కాదంటూ కొందరు నెటిజన్లు ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై వైసీపీ అధినాయకత్వం కూడా సీరియస్ అయినట్లు తెలిసింది.
టిక్కెట్లు కావాలంటూ...
విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి థియేటర్ల యజమాన్యాలకు లేఖ రాశారు. కొత్త సినిమా విడుదలయితే తమకు ప్రతి షోకు వంద టిక్కెట్లు కావాలని కోరారు. ఇందుకు సంబంధించిన డబ్బులు చెల్లిస్తామని, తమకు మాత్రం వంద టిక్కెట్లు ఇవ్వాలని లేఖలో కోరారు. దీంతో థియేటర్ల యాజమాన్యం అవాక్కయింది. ఎప్పుడూ లేని సంప్రదాయానికి మేయర్ భాగ్యలక్ష్మి తెరలేపారని అంటున్నారు. వైసీపీ హైకమాండ్ దీనిపై ఇప్పటికే మేయర్ కు తలంటి నట్లు తెలిసింది.
Next Story

