Wed Jan 28 2026 21:57:45 GMT+0000 (Coordinated Universal Time)
Vijayawada : భారీ వర్షంతో వణుకుతున్న బెజవాడ
నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో విజయవాడ వణికిపోతుంది. రహదారులన్నీ జలమయమయ్యాయి

నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో విజయవాడ వణికిపోతుంది. రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు కష్టంగా మారింది. దీంతో వర్షపు నీటిలో వాహనాలు చిక్కుకుపోయి అనేక మంది వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షం పడుతుండటంతో విజయవాడ నగరవాసులు భయపడిపోతున్నారు.
బస్టాండ్ లోకి...
మరో వైపు విజయవాడ బస్టాండ్ జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. కుండపోత వర్షాలతో విజయవాడ బస్టాండ్ చుట్టూ వరద చేరింది. హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లోకి మోకాళ్ల లోతు నీరు రావడంతో బస్సులు, లారీలు రోడ్లపైనే నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
Next Story

