Fri Dec 05 2025 16:15:20 GMT+0000 (Coordinated Universal Time)
మల్లాది విష్ణుకు కీలక పదవి
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు వైసీపీ అధినేత జగన్ కీలక బాధ్యతలను అప్పగించారు

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు వైసీపీ అధినేత జగన్ కీలక బాధ్యతలను అప్పగించారు. విజయవాడ నగర అధ్యక్షుడిగా నియమించారు. దీంతో పాటు ఎన్నికలు సమీపిస్తున్న పలు కీలక పదవులలో నేతలను నియమించారు. రీజనల్ కోఆర్డినేటర్లను నియమించారు. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాల రీజనల్ కో-ఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డి నియమితులయ్యారు.
కో - ఆర్డినేటర్లుగా...
ఒంగోలు, ఉమ్మడి నెల్లూరు పార్లమెంటు రిలజనల్ కో-ఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించారు. కర్నూలు, నంద్యాల రీజలన్ కో - ఆర్డినేటర్ గా పి. రామసుబ్బారెడ్డిని, కడప, పార్లమెంటు నియోజకవర్గాల రీజనల్ కో - ఆర్డినేటర్ గా కె సురేష బాబు, ఉమ్మడి విశాఖ జిల్లా కో - ఆర్డినేటర్ గా గుడివాడ అమర్నాధ్ నియమిస్తూ వైసీపీ హైకమాండ్ ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story

