Wed Jan 28 2026 19:15:48 GMT+0000 (Coordinated Universal Time)
మా ప్రయోజనాలను కాపాడండి
రైతులకు అండగా కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.

రైతులకు అండగా కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన తర్వాత మీడియాతో మాట్లాడారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం మంచి నిర్ణయమని తెలిపారు. అలాగే ఆహార భద్రత చట్ట అమలులో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పినట్లు ఆయన తెలిపారు. దిశ బిల్లును వెంటనే ఆమోదించాలని, తెలంగాణ ప్రభుత్వం నుంచి విద్యుత్ బకాయీలను వచ్చేలా చూడాలని కోరామన్నారు.
బాబుది పెద్ద డ్రామా.....
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అసెంబ్లీలో ఎవరూ ఏమీ అనలేదని విజయసాయిరెడ్డి తెలిపారు. అసెంబ్లీ రికార్డులు ఒకసారి పరిశీలిస్తే సరిపోతుందన్నారు. ఆయన ఏడుపు ఒక డ్రామా లని, ఆయన పై సానుభూతి ఎవరూ చూపరని కూడా విజయసాయిరెడ్డి తెలిపారు.
Next Story

