Thu Mar 19 2026 20:51:40 GMT+0530 (India Standard Time)
విజయసాయిరెడ్డి ఫోన్ మిస్సింగ్
విజయసాయిరెడ్డి ఫోన్ కన్పించడం లేదు. ఆయన తన ఫోన్ ను ఎక్కడ పోగొట్టుకున్నారో తెలియదు.

విజయసాయిరెడ్డి ఫోన్ కన్పించడం లేదు. ఆయన తన ఫోన్ ను ఎక్కడ పోగొట్టుకున్నారో తెలియదు. వివిధ కార్యక్రమాల్లో హాజరైన విజయసాయిరెడ్డి తన వద్ద ఫోన్ లేకపోవడాన్ని గమనించారు. దీంతో తాడేపల్లి పోలీసులకు ఫోన్ పోయిందని ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు...
విజయసాయిరెడ్డి ఫోన్ కన్పించకుండా పోవడంతో ఎవరో కావాలని దానిని దొంగిలించారని భావిస్తున్నారు. ఫోన్ ఎక్కడ మిస్ అయిందనేది స్పష్టంగా తెలియడం లేదు. విజయసాయిరెడ్డి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అనేక చోట్లకు తిరగడంతో ఎక్కడ మిస్ అయిందన్నది తెలియకుండా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

