Tue Mar 17 2026 15:30:16 GMT+0530 (India Standard Time)
Vijaya Sai Reddy : సాయిరెడ్డి చేరికకు సమయం దగ్గరపడినట్లుందిగా?
విజయసాయిరెడ్డి తాను త్వరలో రాజకీయ పార్టీలో చేరతానని ప్రకటించారు

విజయసాయిరెడ్డి తాను త్వరలో రాజకీయ పార్టీలో చేరతానని ప్రకటించారు. అందుకు సమయం దగ్గర పడుతుండటంతో ఆయన పార్టీ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయసాయిరెడ్డి ఈ ఏడాది జూన్ తర్వాత రాజకీయంగా యాక్టివ్ అవుతానని చెప్పారు. అయితే విజయసాయిరెడ్డి ఏ పార్టీలో చేరతారన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. తాను సొంత పార్టీ పెడుతున్నట్లు వార్తలను అయితే విజయసాయిరెడ్డి ఖండించారు. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారా? లేక తెలుగుదేశం పార్టీలోకి వెళతారా? లేక జనసేన తీర్థం పుచ్చుకుంటారా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే యాక్టివ్ అయ్యేందుకు రెండు నెలలు మాత్రమే సమయం ఉండటంతో ఆయన ప్రస్తుతం వ్యవసాయంలో నిమగ్నమయ్యారు.
ప్రస్తుతం వ్యవసాయానికే...
విజయసాయిరెడ్డి వ్యవసాయం చేసుకుంటున్నారు.ఆయన చెప్పినట్లుగానే రాజకీయాలను వదిలేసి రైతుగా మారారు. ఇకపై రాజకీయాలను వదిలేసి తాను వ్యవసాయమే చూసుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లాలోని శంకరాపురంలో ఉన్న తన సొంత వ్యవసాయ క్షేత్రంలో ఆయన ఒక సామాన్య రైతులా మారి సేంద్రియ వ్యవసాయం చేసుకుంటున్నారు. . మారుతున్న కాలంలో రసాయన ఎరువుల కంటే ప్రకృతి వ్యవసాయమే మేలని ఆయన స్వయంగా ఆచరించి చూపిస్తున్నారు.ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.
సోషల్ మీడియాలో...
తన తోటలోని మిరప చెట్లకు చీడపీడల నుండి రక్షణ కల్పించేందుకు 'అగ్నాస్త్రం' అనే ప్రకృతి సిద్ధమైన కషాయాన్ని స్వయంగా స్ప్రే చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ అగ్నాస్త్రాన్ని తయారు చేసే విధానాన్ని కూడా ఆయన వివరించారు. గోమూత్రం, నూరిన వేపాకులు, వెల్లుల్లి, మిరపకాయలు, పొగాకును ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి బాగా కలిపి, మరగబెట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటల పాటు నిల్వ ఉంచి, ఆపై వడపోసి చెట్లకు వినియోగిస్తారని తెలిపారు. ఇది రసాయన మందుల కంటే శక్తివంతంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా ఆయన పార్టీ ప్రకటన ఎప్పుడుంటుండనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Next Story

